rayalaseema: అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యం.. పరిశీలనలో రాయలసీమలో హైకోర్టు: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

  • 13 జిల్లాల్లోనూ సమగ్ర ప్రగతి సాధ్యం కావాలి
  •  యురేనియం సమస్యకు త్వరలో పరిష్కారం 
  • కడపలో ’నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అమలుపై సమీక్ష 

అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కాకూడదన్నది వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం ఉద్దేశమని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. కడప జిల్లా సచివాలయంలో ’నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అమలుపై మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శ్రీరంగనాథరాజు, అంజాద్‌బాషాతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అలాగే, కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం కారణంగా బాధిత గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు. యురేనియం కర్మాగారంపై ప్రతినెలా మొదటి వారంలో సమీక్ష నిర్వహించడానికి సీఎం నిర్ణయించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News