Tripura: ఆలయాల్లో జంతు బలులపై నిషేధం: త్రిపుర హైకోర్టు తీర్పు
- మాతా త్రిపురేశ్వరి దేవాలయంలో జంతు బలులు
- దీనిని వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది పిటిషన్పై
- చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు
త్రిపుర హైకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. హిందూ దేవాలయాల్లో జంతు బలులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని శక్తిపీఠమైన మాతా త్రిపురేశ్వరి దేవాలయంతోపాటు ఇతర దేవాలయాల్లోనూ ఇకపై జంతువులను బలి ఇవ్వకూడదని హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్కరోల్, జస్టిస్ అరిందం లోథ్తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని త్రిపురేశ్వరి దేవాలయంలో జంతువులను బలి ఇవ్వడం రాజుల కాలం నుంచి కొనసాగుతున్న ఆచారం. దీన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ భట్టాచార్య అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ విధంగా తీర్పు చెప్పింది