Dusserah: దసరా దెబ్బ... ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ రేట్లు పెంచిన దక్షిణ మధ్య రైల్వే
- దసరా సీజన్ మొదలు
- ప్రయాణికుల రద్దీతో ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంపు
- అక్టోబరు 10 వరకేనన్న దక్షిణ మధ్య రైల్వే
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అంతా ఇంతా ఉండదు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో వాహనాలు క్రిక్కిరిసిపోతుంటాయి. రైళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో, దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు పెంచింది. టికెట్ ధర రూ.10 నుంచి రూ.30కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అయితే, ఇవి పండుగ సీజన్ వరకే అమల్లో ఉంటాయి. నేటి నుంచి అక్టోబరు 10 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి. ఆ తర్వాత పాత రేట్లనే అమలు చేస్తారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.