Bihar: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం
- బీహార్, ఉత్తరాఖండ్, యూపీపై వరుణుడి పంజా
- బీహార్ లో కుండపోత వానలు
- నీట మునిగిన డిప్యూటీ సీఎం నివాసం
దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వరదలకు కారణమైన వరుణుడు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసిరాడు. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు వరద ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా బీహార్ లో రాజధాని పాట్నా సహా అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.
బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ నివాసం కూడా నీట మునిగింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు రైళ్లను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలతో ఈ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు వర్షాల కారణంగా 73 మంది మృతి చెందినట్టు సమాచారం.