Kodela: పావురాలగుట్ట మీద ముక్కలు ఏరుకుంటున్న సమయంలో.. ఇంటి దగ్గర సంతకాలు చేయించుకున్నారు: జవహర్

  • శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీని అందరూ నిలదీయాలి
  • టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే కోడెలకు మనమిచ్చే నివాళి
  • కోడెల సంతాపసభలో జవహర్ వ్యాఖ్యలు
శవ రాజకీయాలను చేస్తున్న వైసీపీని అందరూ నిలదీయాలని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. నరసరావుపేటలో ఈరోజు నిర్వహించిన కోడెల సంతాపసభలో ఆయన మాట్లాడుతూ, టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే కోడెలకు మనం అర్పించే అసలైన నివాళి అని చెప్పారు. పావురాలగుట్ట మీద మాంసపు ముక్కలను ఏరుకుంటున్న సమయంలో... ఇంటి దగ్గర సంతకాలు చేయించుకున్నారంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు.

మరో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, పరిటాలను చంపిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసని, కోడెల మరణానికి కారణమైన వారికి కూడా అదే గతి పడుతుందని అన్నారు. వైసీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు.
Kodela
Jawahar
Telugudesam
YSRCP

More Telugu News