Uttar Pradesh: బీహార్ డిప్యూటీ సీఎంను ఇంటి నుంచి బోటులో తరలించిన సహాయక సిబ్బంది!
- ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు
- యూపీలో 111, బీహార్ లో 27 మంది మృత్యువాత
- సుశీల్ మోదీని బోటులో తరలించిన సహాయక సిబ్బంది
ఉత్తరాదిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బీహార్, ఉత్తరప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యూపీలో 111 మంది, బీహార్ లో 27 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క బీహార్ లోనే 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ఇంట్లోకి భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో, ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ లో గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో... జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు.