Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 22 శాతానికి పైగా పతనమైన యస్ బ్యాంక్
- 361 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 114 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- అమ్మకాల ఒత్తిడికి గురైన బ్యాంకింగ్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 38,305కు పడిపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు పతనమై 11,359కు దిగజారింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు లాభాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 726 పాయింట్ల వరకు నష్టపోయింది. బ్యాంకింగ్ స్టాకులు తీవ్ర స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు కుప్పకూలాయి. చివర్లో సూచీలు కొంత మేర కోలుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.99%), మారుతి సుజుకి (0.99%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.33%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-22.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.30%), ఎస్బీఐ (-5.50%), భారతి ఎయిర్ టెల్ (-4.32%), ఓఎన్జీసీ (-2.77%).