mumbai: వర్లీలో తెలుగు పోస్టర్లు.. శివసేన వినూత్న ఎన్నికల ప్రచారం

  • తొలిసారి బరిలోకి థాకరే కుటుంబం
  • వర్లీ నుంచి పోటీ చేస్తున్న ఆదిత్య థాకరే
  • వర్లీలో స్థిరపడిన వలస కుటుంబాలే లక్ష్యంగా పోస్టర్లు

త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడ స్థిరపడిన తెలుగువారిని ఆకర్షించేందుకు శివసేన వినూత్న ప్రచారం చేస్తోంది. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న థాకరే కుటుంబం గెలుపు కోసం అన్ని దారులను ఉపయోగించుకుంటోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే బరిలో దిగడంతో ముంబై మొత్తం అతడి పోస్టర్లు వెలిశాయి. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. అక్కడి తెలుగు వారి ఓట్లను కొల్లగొట్టడమే ధ్యేయంగా పోస్టర్లను తెలుగులో ముద్రించారు. ‘నమస్తే వర్లీ’ అని నగరం మొత్తం భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. తెలుగుతోపాటు మరాఠీ, గుజరాతీ, ఉర్దూల్లోనూ పోస్టర్లు ముద్రించారు. ఈ నెల 21న ఎన్నికలు జరగనుండగా ఆదిత్య థాకరే వర్లీ నుంచి బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News