YSRCP: వైసీపీ సోషల్ మీడియా విభాగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

  • చంద్రబాబును కించపరుస్తున్నారంటూ ఫిర్యాదు
  • మహిళానేతలపైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ
  • పోలీసులు పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని హితవు
టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ సోషల్ మీడియా విభాగంపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మహిళా నేతల్ని కూడా కించపరుస్తున్నారంటూ వర్ల రామయ్య తన ఫిర్యాదులో ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.
YSRCP
Social Media
Telugudesam
Varla Ramaiah

More Telugu News