Hyderabad: హైదరాబాద్‌లో తొలిసారి.. డ్రంకెన్ డ్రైవ్‌కు రూ. 10,500 చలానా
- హైదరాబాద్‌లో ఇంకా అమల్లోకి రాని కొత్త చట్టం
- డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన 9 మంది
- మరోమారు దొరికితే రూ.15 వేల చలానా తప్పదని హెచ్చరిక
కొత్త వాహన చట్టం తెలంగాణలో ఇంకా అమల్లోకి రానప్పటికీ, అందుకు తగ్గట్టుగా తొలిసారి హైదరాబాద్‌లో మందు తాగి వాహనాలు నడిపినందుకు గాను భారీ జరిమానాలు విధించారు. నిజానికి కొత్త వాహన చట్టం హైదరాబాద్‌లో ఇంకా అమల్లోకి రాలేదు. అయితే, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి గురువారం నాంపల్లి కోర్టు భారీ చలానాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల 9 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వీరికి ఒక్కొక్కరికీ రూ.10,500 చొప్పున చలానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్‌లో మరోమారు దొరికితే ఈసారి రూ. 15 వేల వరకు చలానా విధించే అవకాశం వుందని అధికారులు వీరిని హెచ్చరించారు.