Uttar Pradesh: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు.. స్కాన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు

  • శరీరంలోని చాలా అవయవాలు వేరే స్థానాల్లో
  • గుండె కుడివైపు.. కాలేయం ఎడమవైపున
  • తన కెరియర్‌లో ఇదే తొలి కేసున్న వైద్యుడు శశాంక్

కడుపు నొప్పితో విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అతడి శరీరంలోని చాలా అవయవాలు వాటివాటి స్థానాల్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉండడం వారిని షాక్‌కు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ పాద్రౌనాలో జరిగిందీ ఘటన.

జమాలుద్దీన్ ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ గోరఖ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు. ఆయా రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి గుండె కుడివైపు, కాలేయం ఎడమవైపున ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, చాలావరకు భాగాలు నిర్ధారిత స్థానాల్లో కాకుండా వేర్వేరు చోట్ల ఉండడంతో విస్తుపోయారు.

జమాలుద్దీన్ పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టు గుర్తించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామని అయితే, అది అందరికీ భిన్నంగా ఎడమ వైపున ఉండడంతో ఆపరేషన్ చాలా కష్టమైందని వైద్యుడు శశాంక్ దీక్షిత్ తెలిపారు. మూడు రకాల ల్యాప్రోస్కోపిక్ యంత్రాలను ఉపయోగించి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసును చూడడం తన కెరియర్‌లో ఇదే తొలిసారని తెలిపారు.

  • Loading...

More Telugu News