Sensex: ప్రభావం చూపని ఆర్బీఐ నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 433 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 139 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • తీవ్ర ఒత్తిడికి గురైన బ్యాంకింగ్ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ... ఆ నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరచలేక పోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,673కు పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,174కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.03%), ఇన్ఫోసిస్ (0.90%), ఓఎన్జీసీ (0.82%), టెక్ మహీంద్రా (0.74%), ఎన్టీపీసీ (0.39%).    


టాప్ లూజర్స్:
కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.46%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.44%), టాటా మోటార్స్ (-2.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.75%), టాటా స్టీల్ (-2.39%).

  • Loading...

More Telugu News