TSRTC: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సర్కార్ షాకింగ్ నిర్ణయం!
- చర్చల కోసం నియమించిన త్రిసభ్య కమిటీ రద్దు
- నేటి సాయంత్రం లోగా కార్మికులు విధుల్లో చేరాలని అల్టిమేటం
- లేదంటే ఉద్యోగాలు ఊడినట్టేనని హెచ్చరిక
నేటి నుంచి తలపెట్టిన ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కార్మికులతో ఇకపై చర్చలు జరపరాదని నిర్ణయించింది. చర్చల కోసం ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని రద్దు చేసింది. దసరా వేళ కార్మికులు సమ్మెకు దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం నేటి సాయంత్రం 6 గంటల లోపు కార్మికులందరూ విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. అటువంటి వారినే ఉద్యోగులుగా పరిగణిస్తామని, లేనివారి ఉద్యోగం ఊస్టింగేనని హెచ్చరించింది. విధులకు హాజరు కాని వారు తమ ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదులుకున్నట్టే అవుతుందని స్పష్టం చేసింది. విధుల్లో చేరిన వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.