TSRTC: ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తే... 49,733 మందిలో విధులకు వచ్చింది 160 మంది!

  • డ్రైవర్, కండక్టర్లు 10 మందే
  • సెలవులో ఉన్న 13 వేల మంది
  • వారికి నేటి సాయంత్రం వరకూ చాన్స్

శనివారం సాయంత్రంలోగా విధుల్లోకి చేరని ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయినట్టేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పినా, కార్మికులు ఏ మాత్రమూ లెక్కచేయలేదు. టీఎస్ ఆర్టీసీలో మొత్తం 49,733 మంది పని చేస్తుండగా, డెడ్ లైన్ ముగిసేసరికి కేవలం 160 మంది మాత్రమే విధుల్లోకి వచ్చారు. వీరిలో డ్రైవర్, కండక్టర్ విభాగాలకు చెందిన వారు 10 మంది మాత్రమే కావడం గమనార్హం.

ఖమ్మం జిల్లాలో ఆరుగురు, మెదక్ జిల్లాలో నలుగురు డ్రైవర్, కండక్టర్లు విధుల్లోకి రాగా, మిగతా వారంతా సూపర్ వైజర్లు, క్లర్క్ కేడర్ల వారే. ఇదే సమయంలో రోజువారీ వీక్లీ ఆఫ్ లు, స్పెషల్ ఆఫ్, నైట్ డ్యూటీ చేసి రిలీఫ్ లో ఉన్న వారు 13 వేల మంది వరకూ ఉండవచ్చని, వీరంతా ఆదివారంలోగా విధుల్లోకి చేరే వెసులుబాటు కల్పిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలావుండగా, సమ్మె సంపూర్ణంగా జరుగుతోందని ఆర్టీసీ ఐకాస నాయకులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News