Guntur District: ప్రైవేట్ బస్సులపై కొనసాగుతున్న ఏపీ రవాణాశాఖ తనిఖీలు!
- అధిక ఛార్జీలు వసూలు చేయడంపై చర్యలు
- 25 కాంట్రాక్టు క్యారియర్ బస్సులపై కేసులు నమోదు
- అధిక ఛార్జీలు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు: డీటీసీ మీరా ప్రసాద్
దసరా పండగకు ప్రయాణికుల రద్దీ కారణంగా తమ ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఏపీ రవాణా శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై చర్యలు చేపట్టింది.
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, పేరేచర్ల, కాజా వద్ద 25 కాంట్రాక్టు క్యారియర్ బస్సులపై కేసులు నమోదు చేసింది. వాహన యజమానులపై కేసులు నమోదు చేసి, అపరాధ రుసుం విధించింది. ఈ సందర్భంగా డీటీసీ మీరా ప్రసాద్ మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం నిర్ణీత ధరలకే టికెట్లు విక్రయించాలని, అధిక ఛార్జీలు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.