Vizag: విరిగిన పట్టాలు... విశాఖ - విజయవాడ మధ్య నిలిచిన రైళ్లు!

  • కశింకోట సమీపంలో ఘటన
  • నిలిచిన జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు
  • ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
విశాఖపట్నం జిల్లా కశింకోట సమీపంలో రైలు పట్టాలు విరగడంతో, విజయవాడ - విశాఖ మధ్య నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పట్టాలను సరిచేసే పనిలో పడ్డారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. వీటితో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లు గంట నుంచి రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నానికి పట్టాలను సరిచేస్తామని అధికారులు వెల్లడించారు.
Vizag
Duvvada
Trains
Track

More Telugu News