Vijay Chander: ఆ సినిమాతో ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది: సీనియర్ నటుడు విజయ్ చందర్
- 'కరుణామయుడు' కోసం ధైర్యం చేశాను
- 6 రోజుల వరకూ థియేటర్లు ఖాళీగా వున్నాయి
- 'రాజాధిరాజు'తో 30లక్షలు పోయాయన్న విజయ్ చందర్
కథానాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా .. నిర్మాతగా విజయ్ చందర్ సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'కరుణామయుడు' సినిమాను గురించి ప్రస్తావించారు. "అప్పట్లో ఎంజీఆర్ వంటి హీరోలు సైతం యేసుప్రభు పాత్రను వేయడానికి ఆలోచించారు. నేను మాత్రం ధైర్యంగా 'కరుణామయుడు' సినిమాలో యేసుప్రభుగా నటించాను.
ఎన్నో కష్టాలుపడి సినిమాను విడుదల చేశాను. మొదటి ఆరు రోజులు థియేటర్స్ లో జనాలు లేరు. మరో సినిమా వస్తే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేయడానికి సిద్ధంగా వున్నారు. అలాంటి పరిస్థితుల్లో వసూళ్లు పుంజుకున్నాయి. జనాలు పల్లెటూళ్ల నుంచి టౌన్లకి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మరీ చూశారు. ఈ సినిమా కోసం నేను 30 లక్షల వరకూ ఖర్చు చేశాను. పెట్టిన డబ్బు వచ్చింది .. దాంతో 'రాజాధిరాజు' సినిమాను నిర్మించాను. అంతే ఆ 30 లక్షలు పోయాయి" అని చెప్పుకొచ్చారు.