West Bengal: ప్రేమ.. పెళ్లి.. అంతా జస్ట్ నాలుగు గంటలలోనే!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • మూడు నెలలుగా ఫేస్ బుక్ పరిచయం 
  • కనబడగానే ప్రపోజ్.. వెంటనే వివాహం
ఓ యువతిని చూసీచూడగానే ప్రేమించేసిన యువకుడు, ఆమె కాళ్ల ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయగా, అతని నిజాయతీని నమ్మిన యువతి వెంటనే ఓకే చెప్పింది. ఇంకేముంది... ఆపై నాలుగు గంటల వ్యవధిలోనే పెళ్లి జరిగిపోయింది.

సినిమా స్టోరీ కూడా ఇంత వేగంగా ఉండదేమో అన్నట్టు కనిపిస్తున్న ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీ వివరాల్లోకి వెళితే, కోల్‌ కతాలోని హింద్‌ మోటార్ ప్రాంతానికి చెందిన సుదీప్ ఘోషల్, షియోరాఫూలికి చెందిన ప్రతమా బెనర్జీలకు గడచిన మూడు నెలలుగా సోషల్ మీడియా ద్వారా పరిచయం కొనసాగుతోంది. వీరిద్దరికీ ముఖ పరిచయం లేదు. సుదీప్ ఫార్మాసూటికల్ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేస్తుండగా, ప్రతమా ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో దసరా సందర్భంగా ఓ పూజా మండపం వద్ద అనుకోకుండా వీరిద్దరూ కలిశారు. ఆమె కనబడగానే, మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అతడి నిజాయతీ, అమాయకత్వం చూసిన ప్రతమా, వెంటనే ఒప్పేసుకుంది. ఆపై వారి స్నేహితుల అండతో, రాత్రి 10:30 సమయంలో, స్థానిక కల్యాణ మండపంలో బాజాభజంత్రీలు మోగుతుండగా, దండలు మార్చుకున్నారు. ఈ పెళ్లిని వధూవరులిద్దరి తరపు కుటుంబాలు స్వాగతించడం గమనార్హం.
West Bengal
Marriage
Prapose
Facebook
Social Media

More Telugu News