Jagadish Reddy: మా సీఎంను చూస్తే ఢిల్లీ పార్టీలకు వణుకు పుడుతుంది: జగదీశ్ రెడ్డి
- భయం వల్లే కాంగ్రెస్, బీజేపీలు కుట్రలకు తెరతీశాయి
- హుజూర్ నగర్ లో ఓట్లు అడిగే హక్కు ఉత్తమ్ కు లేదు
- ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ఢిల్లీ పార్టీలకు వణుకు పుడుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆ భయం వల్లే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిద్ధాంతాలను వదిలేసి కాంగ్రెస్, బీజేపీలు కుట్రలకు తెరతీశాయని విమర్శించారు.
ఎన్ని కుట్రలకు పాల్పడినా ఆ పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని తెలిసినా బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. హుజూర్ నగర్ ను వెనుకబాటుకు గురి చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేకపోయినందుకు ప్రజలకు ఉత్తమ్ క్షమాపణ చెప్పాలని అన్నారు.