intercity express: నవంబర్ 3 నుంచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కొత్త వేళలు
- వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమని గతంలో ప్రకటన
- తాజాగా అమలు తేదీని ముందుకు జరిపిన రైల్వేశాఖ
- విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో నిర్ణయం
విజయవాడ-లింగంపల్లి-విజయవాడ మధ్య తిరిగే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ టైంటేబుల్‌ను దక్షిణ మధ్య రైల్వేశాఖ ముందుకు జరిపింది. జనవరి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి తెస్తామని గతంలో ప్రకటించిన రైల్వేశాఖ తాజాగా నవంబరు 3 నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు.
కొత్త టైం టేబుల్ ప్రకారం12796 లింగంపల్లి - విజయవాడ రైలు గుంటూరుకు ఉదయం 9.20కే చేరుకుని 9.22కి బయలుదేరుతుంది. మంగళగిరికి 9.42కి చేరుకుని 9.43కి బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10.30కి చేరుతుంది. నంబరు 12795 విజయవాడ - లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కి రాత్రి 10.20కి చేరుకుని 10.25కి బయలుదేరుతుంది. బేగంపేటకు రాత్రి 10.34కి చేరుకుని 10.35కి బయలుదేరి లింగంపల్లికి రాత్రి 11.15కి చేరుకుంటుంది.