India: పీకల్లోతు కష్టాల్లో దక్షిణాఫ్రికా... లంచ్ సమయానికి 6 వికెట్లు డౌన్!

  • 136 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
  • 52 పరుగులతో క్రీజులో ఉన్న డుప్లెసిస్
  • ఫాలో ఆన్ తప్పాలంటే మరో 265 పరుగులు చేయాల్సిందే

పూణెలో ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట మూడవ రోజు లంచ్ విరామ సమయానికి 6 వికెట్లను కోల్పోయిన సౌతాఫ్రికా కేవలం 136 పరుగులు మాత్రమే చేసి, 465 పరుగుల వెనుకంజలో ఉంది.

దక్షిణాఫ్రికా జట్టులో డుప్లెసిస్ 52 పరుగులతో, ముత్తుస్వామి 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఎల్గర్ 6, మార్క్ రామ్ 0, బ్రూన్ 30, బవుమా 8, నార్ట్ జీ 3, డికాక్ 31 పరుగులకు అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు 3, షమీకి రెండు, అశ్విన్ కు ఒక వికెట్ దక్కాయి. ఇశాంత్ శర్మ, జడేజాలు బౌలింగ్ చేసినప్పటికీ, వారికి వికెట్లు దక్కలేదు.

 ఆట మరో రెండున్నర రోజులు మిగిలివున్న ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టు ఫాలో ఆన్ ఆడాల్సి రావచ్చని అంచనా. చేతిలో ఉన్న నాలుగు వికెట్లూ పడిపోయేలోపు ఆ జట్టు 265 పరుగులు చేయకుంటే, ఫాలో ఆన్ ఆడించాలన్న వ్యూహాన్ని భారత్ అమలు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో డుప్లెసిస్ మినహా మిగతా ఆటగాళ్లంతా టెయిలండర్లే. స్పిన్ కు, సీమ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై వారు నిలదొక్కుకోవడం కష్టసాధ్యమే.

  • Loading...

More Telugu News