India: టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్న సఫారీ టెయిలెండర్లు
- పూణేలో దక్షిణాఫ్రికాతో టెస్టు
- సఫారీ టాపార్డర్ ను కుప్పకూల్చిన టీమిండియా
- ఎదురొడ్డి పోరాడుతున్న సఫారీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్
పూణే టెస్టులో దక్షిణాఫ్రికా టాపార్డర్ ను కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత పట్టు విడిచారు. భారత బౌలర్ల ఉదాసీనతను చక్కగా ఉపయోగించుకున్న సఫారీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోర్లు సాధించడమే కాదు, ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ ఆతిథ్య జట్టు సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 601/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీలు 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చిక్కుల్లోపడ్డారు.
ఈ దశలో భారత బౌలర్లు మరింత పట్టుబిగించి ఉంటే పర్యాటక జట్టు 100 పరుగుల లోపే ఫినిష్ అయ్యేది. కానీ, మనవాళ్ల 'ఔదార్యం' సఫారీలకు వరమైంది. ప్రస్తుతం సఫారీలు 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేశారు. క్రీజులో వెర్నాన్ (23) ఫిలాండర్, కేశవ్ మహరాజ్ (21) ఆడుతున్నారు. ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు.