Telangana: సమ్మె పోటు... విద్యాసంస్థలకు మరోసారి సెలవులు పొడిగించిన తెలంగాణ సర్కారు
- ఈ నెల 14న ప్రారంభం కావాల్సిన స్కూళ్లు
- కొనసాగుతున్న సమ్మె
- పాఠశాలలకు ఈ నెల 19 వరకు సెలవులు పెంపు
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టడంతో ప్రజా రవాణా కుంటుపడింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి పూర్తిస్థాయిలో లేవని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో 15వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి సెలవులు పొడిగించక తప్పలేదు. ఈ నేపథ్యంలో, అదనపు బస్సులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.