Uttar Pradesh: ఊరికి సమీపంలో డంపింగ్ యార్డ్.. పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్న యువకులు!

  • పిల్లను ఇచ్చేందుకు జంకుతున్న అమ్మాయిల తల్లిదండ్రులు
  • పెళ్లి కాకుండా ముదిరిపోతున్న యువకులు
  • డంపింగ్ యార్డు ఉండడం తప్పుకాదన్న అధికారులు

ఉత్తరప్రదేశ్‌, కాన్పూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లోని యువకుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆయా ఊర్లకు తమ పిల్లలను ఇచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో యువకులంతా పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు. జిల్లాలోని ఢిల్లీ జాతీయ రహదారిపై ఉన్న బదువాపూర్, పన్కీపడకా, జుమాయి, సరయమిత్ర గ్రామాల్లోని యువకుల పరిస్థితి ఇది. కారణం ఆయా గ్రామాలకు సమీపంలో డంపింగ్ యార్డ్ ఉండడమే. యార్డు నుంచి వస్తున్న దుర్గంధంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ జబ్బుల బారిన పడుతున్నారు.

దీంతో ఆయా గ్రామాల్లోని యువకులకు పిల్లను ఇచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. ఫలితంగా యువకులంతా పెళ్లికాకుండానే ముదిరిపోతున్నారు. మరోవైపు, డంపింగ్ యార్డు ఉండడం తప్పు కాదని చెబుతున్న అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News