Tirumala: కొత్త రికార్డు... నిన్న తిరుమలలో లక్ష మందికి స్వామి దర్శనం!

  • పెరటాసి మాసం ప్రారంభం
  • తొలిరోజే కిక్కిరిసిన ఏడు కొండలు
  • సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం

ఇటీవలి కాలంలో ఎన్నడూ రానంత మంది భక్తులు తిరుమల వెంకన్న దర్శనానికి తరలివచ్చారు. తమిళ పెరటాసి మాసం ప్రారంభం కావడంతో ముందురోజే స్వామి దర్శనానికి వచ్చిన తమిళ భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండి, సర్వదర్శనం క్యూలైన్ మూడు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. ఇటీవలి బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవనాడు కూడా ఇంతమంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి చూడలేదని స్వయంగా అధికారులే అంటున్నారు.

ఇక ఆదివారం నాడు స్వామివారిని 1,03,310 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇది ఓ రికార్డు. ఈ ఉదయం దర్శనం కోసం వచ్చిన వారికి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సాధారణ భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో కాలినడక మార్గాల్లో వచ్చే భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను అధికారులు నిలిపివేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అన్న పానీయాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News