health: మధుమేహులకు తక్కువ కేలరీల ఆహారంతో ప్రయోజనాలు!

  • పురుషులు, మహిళలపై వేర్వేరు స్థాయుల్లో ప్రభావం
  • మహిళల కంటే గణనీయంగా బరువు తగ్గిన పురుషులు
  • డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ వర్సిటీ పరిశోధన ఫలితాలు

మారుతున్న ఆహారపు అటవాట్లు, జీవన శైలితో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. ఇందులో భాగంగా చాలా మంది బరువు తగ్గించుకునేందుకు శ్రమిస్తుంటారు. ఇందుకోసం తక్కువ కేలరీలు ఉండే ఆహార పదార్థాలనే తీసుకుంటారు. అయితే, ఇటువంటి ఆహార పదార్థాలు ఏ మేరకు మేలు చేస్తాయన్న విషయంపై డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ వర్సిటీ జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం తేలింది. తక్కువ కేలరీలుండే ఆహార పదార్థాలు పురుషులు, మహిళలపై వేర్వేరు స్థాయుల్లో ప్రభావం చూపుతున్నాయని తెలిసింది.
 
తమ పరిశోధనలో భాగంగా పరిశోధకులు డయాబెటిస్‌ తొలిదశ ఉన్న 2000 మందికి 8 వారాల పాటు తక్కువ కేలరీల ఆహార పదార్థాలు అందించారు. ఆ తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళల కంటే పురుషులు గణనీయంగా బరువు తగ్గినట్లు తేలింది. మధుమేహం ఉన్నవారి జీవక్రియ రేటు, రక్తంలో చక్కెరస్థాయి, కొవ్వు ద్రవ్యరాశితో పాటు గుండె కొట్టుకునే రేటు కొంతమేర తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు మధుమేహం తొలిదశ ఉన్న వారు బరువును నియంత్రణలో ఉంచడం ముఖ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News