CPI Narayana: తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య యుద్ధవాతావరణం సృష్టించారు: కేసీఆర్ పై సీపీఐ నారాయణ మండిపాటు

  • ఆర్టీసీ సమ్మెపై స్పందించిన నారాయణ
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం అంటూ వ్యాఖ్యలు
  • మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీపీఐ అగ్రనేత నారాయణ స్పందించారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. మృతి చెందిన ఒక్కో కార్మికుడికి రూ.కోటి చొప్పున చెల్లించడమే కాకుండా, మృతుల కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత ఇల్లు కూడా కల్పించాలని సూచించారు.

సీఎం కేసీఆర్ పాలన చూస్తుంటే నియంతకు తీసిపోని విధంగా ఉందని నారాయణ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడడం తీవ్ర విచారం కలిగిస్తోందని అన్నారు. తాత్కాలికంగా పనిచేస్తున్న కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగుల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించారంటూ ఆయన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News