Kodandaram: టీఆర్ఎస్ ను గెలిపించొద్దు.. కేసీఆర్ కు అహం పెరుగుతుంది: కోదండరామ్

  • ఆర్టీసీని ముక్కలు చేసి ప్రైవేటుకు అమ్మేయాలనుకుంటున్నారు
  • రుణమాఫీ ఆలస్యం కావడం వల్ల రైతులు అప్పులపాలయ్యారు
  • హుజూర్ నగర్ లో పద్మావతిని గెలిపించాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరామ్ విమర్శించారు. ఆర్టీసీని ముక్కలు చేసి ప్రైవేటుకు అమ్మేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీని ఆలస్యం చేయడం వల్ల రైతులు అప్పులపాలయ్యారని విమర్శించారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ గెలిస్తే... కేసీఆర్ కు అహంకారం మరింత పెరుగుతుందని చెప్పారు. యాతవాకిళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్ కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ల విషయంలో టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే హుజూర్ నగర్ లో ప్రశాంత వాతావరణం ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News