Andhra Pradesh: ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాల్సింది మద్యం షాపులు కాదు... స్కూళ్లు, ఆసుపత్రులు!: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- ఏపీ సర్కారుపై బీజేపీ నేత విమర్శలు
- ఉన్నత విద్యావంతుల సేవలు సవ్యరీతిలో వినియోగించుకోవాలని హితవు
- ట్విట్టర్ లో స్పందన
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సర్కారుపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాల్సింది మద్యం షాపులు కాదని, స్కూళ్లను, ఇతర విద్యాలయాలను, ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపితే బాగుంటుందని హితవు పలికారు.
మద్యం షాపులను ప్రభుత్వమే నడుపుతుందని చెబుతున్న సీఎం జగన్ గారు, ఇవాళ ఆ మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉన్నత విద్యావంతుల గురించి ఆలోచించాలని సూచించారు. వారి సేవలను విద్య, వైద్య రంగాల్లో ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.