Telangana: నష్టాన్ని పూడ్చడానికి ఆర్టీసీ ఆస్తులు విక్రయించడం ఎక్కడి న్యాయం?: భట్టి విక్రమార్క
- తెలంగాణ సర్కారుపై ధ్వజమెత్తిన భట్టి
- కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రతిపక్షాలా? అంటూ వ్యాఖ్యలు
- కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని మండిపాటు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. నష్టాలను పూడ్చడానికి ఆర్టీసీ ఆస్తులు అమ్ముతామనడం ఎక్కడి న్యాయమని అడిగారు. నాడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని చెప్పింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితికి తమను తప్పుబడుతూ అధికార పక్షం వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రతిపక్షాలా? అంటూ ప్రశ్నించారు. అసంబద్ధమైన విధానాలతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని భట్టి విక్రమార్క ఆరోపించారు.