Prostitute: డబ్బు ఎక్కువ అడిగిన వ్యభిచారిణి.. కత్తితో 30 పోట్లు పొడిచి చంపేసిన విటుడు!
- ముంబైలోని కామాటిపురలో ఘటన
- ఈనెల 13న హత్య
- ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
డబ్బు ఎక్కువగా డిమాండ్ చేసిందన్న కోపంతో ఓ వ్యభిచారిణిని ఆమె వద్దకు వచ్చిన విటుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముంబైలో కేటరింగ్ పనులు చేసే ఓ యువకుడు ఈనెల 13న స్థానికంగా ఉన్న కామాటిపురాలోని ఓ వ్యభిచార గృహానికి వచ్చాడు. అక్కడున్న వ్యభిచారిణుల్లో ఒకామెను సెలెక్ట్ చేసుకున్నాడు. అనంతరం ఆమె ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో... కోపంతో 30 కత్తిపోట్లు పొడిచాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అతను అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.