USA: ట్రంప్ తమని అణచి వేస్తున్నారన్న టెక్సాస్ హౌస్ స్పీకర్ డెన్నిస్ బొన్నెన్!
- యూఎస్ అధికార పార్టీలో కుమ్ములాట?
- 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెన్నిస్ రికార్డెడ్ వీడియో బహిర్గతం
- డెన్నిస్ సొంత పార్టీకే ద్రోహం చేస్తున్నాడని సహచర నేత మైఖేల్ క్విన్ ఆరోపణ
అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీల ఎంపికకు సంబంధించి ప్రక్రియలో టెక్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటీటివ్స్ స్పీకర్ డెన్నిస్ బొన్నెన్ తమ పార్టీకే చెందిన అధ్యక్షుడు ట్రంప్, ఇతర నేతలను విమర్శించారు. ప్రైమరీల అభ్యర్థులనే లక్ష్యంగా చేసుకొని డెన్నిస్ అన్నమాటలు, రాష్ట్రంలోని డెమోక్రెటిక్ లా మేకర్లతో సంప్రదించడానికి సొంత పార్టీ నేతలను తిట్టిన ఓ వీడియో బహిర్గతం కావడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. అయితే ఈ వీడియో తనను ఇరికించాలని తప్పుగా ఎడిట్ చేశారని డెన్నిస్ పేర్కొన్నారు.
ప్రైమరీల ఎంపికలో... తమ పార్టీకే చెందిన ట్రంప్, టెక్సాస్ లో తమను అణగదొక్కాలని చూస్తున్నారని డెన్నిస్ ఆరోపించారు. డెన్నిస్, తన సహచర రిపబ్లికన్ నేత మైఖేల్ క్విన్ సలివియన్, మరో రిపబ్లికన్ నేత డస్టిన్ బారోస్ లు జూన్ నెలలో పాల్గొన్న ఇంటర్వ్యూ వీడియో ఒకటి బహిర్గతమైంది. ఈ వీడియోను మైఖేల్ క్విన్ బహిర్గతం చేశాడు.
2020- ప్రైమరీల అభ్యర్థులను విరమించుకునేలా చేయడంలో సహకరించాలని డెన్నిస్ తనను క్విడ్ ప్రో కో ఆఫర్ చేశాడని మైఖేల్ క్విన్ తెలిపాడు. మరోవైపు ఈ వీడియోలో సంభాషణలు అంత స్పష్టంగా లేవని, కావాలని తనను తప్పులో ఇరికించే విధంగా ఎడిట్ చేశారని, దీని వెనుక ట్రంప్ ఉన్నారని డెన్నిస్ ఆరోపించారు. కొంతమంది ప్రైమరీలను విరమించుకునేలా చేయాలని మైఖేల్ క్విన్ ను డెన్నిస్ కోరినట్లు ఈ వీడియోలో వుంది. మరోవైపు డెమోక్రాట్లు డెన్నిస్ ను స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.