Kerala: కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ పై ఉక్కుపాదం... 123 కిలోల బంగారం పట్టివేత!
- కేరళలో దాడులు జరిపిన కస్టమ్స్ అధికారులు
- 23 ప్రాంతాల్లో రైడ్స్
- రూ. 50 కోట్ల విలువైన బంగారం పట్టివేత
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ పై కస్టమ్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పోలీసులతో కలిసి త్రిసూర్ జిల్లాలో దాడులు జరిపి 123 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ. 50 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం 23 ప్రాంతాల్లో దాడులు చేశామని, కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి బంగారాన్ని సేకరించిన స్మగ్లర్లు, రోడ్డు మార్గం ద్వారా త్రిసూర్ కు తరలించారని చెప్పారు. ఈ సందర్భంగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న 17 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వారి వద్ద రూ. 2 కోట్ల నగదు, రూ. 6.40 లక్షల విలువ చేసే అమెరికా డాలర్లు కూడా లభించాయని పేర్కొన్నారు.