rbi: కొత్త రూ.1000 నోట్లు విడుదలయ్యాయంటూ అసత్య ప్రచారం
- సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
- నోటుపై స్పష్టంగా 'ఆర్టిస్టిక్ ఇమాజినేషన్' అనే పదం
- ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉండాల్సిన చోట 'ఎంకే గాంధీ' పదం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.1,000 నోట్లను తీసుకొచ్చిందంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో ఇందుకు సంబంధించిన ఫొటోలను చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. అయితే, ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ చిత్రాలను మీరు జూమ్ చేసి పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది.
ఈ నోటుకు ముందు భాగంలో పైన ఉన్న కుడి కార్నర్ లో ఆంగ్లంలో 'ఆర్టిస్టిక్ ఇమాజినేషన్' అనే పదం ఉంది. ఈ చిత్రాలు నకిలీవని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం చాలు. అంతేగాక, రూ.1000 నోట్లను విడుదల చేస్తున్నామంటూ ఆర్బీఐ వెబ్ సైట్ లో ఎటువంటి నోటిఫికేషన్ లేదు. అలాగే, ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉండాల్సిన చోట ఎంకే గాంధీ అంటూ రాసి ఉంది.