Travel Raga: ‘ట్రావెల్ రాగా.కామ్’ పేరిట మోసం.. నిందితుల అరెస్ట్!

  • ఆన్ లైన్ ట్రావెలింగ్ ఏజెంట్ల పేరిట మోసాలు
  • విశాఖపట్టణం పోలీసులకు ఫిర్యాదు
  • నిందితులను ఢిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు
ఆన్ లైన్ ట్రావెలింగ్ ఏజెంట్ల పేరుతో మోసాలకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్టణానికి చెందిన పర్యాటకుల ఫిర్యాదు మేరకు నిందితులను విశాఖపట్టణం పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ‘ట్రావెల్ రాగా.కామ్’ పేరిట నిందితులు విక్రమ్ జీత్, హితేష్ లు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లే నిమిత్తం ‘ట్రావెల్ రాగా.కామ్’ ద్వారా నవనీతకుమార్ అనే వ్యక్తి ఆ సంస్థకు రూ.50 వేలు చెల్లించినట్టు సమాచారం.
Travel Raga
Online Travelling
Vizag
Delhi

More Telugu News