Manjima Mohan: నటి మంజిమా మోహన్ కు ప్రమాదం... కాలికి సర్జరీ!

  • సోషల్ మీడియాలో విషయం చెప్పిన నటి
  • నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన వైద్యులు
  • దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నానని వ్యాఖ్య
దక్షిణాది హీరోయిన్ మంజిమా మోహన్ ప్రమాదానికి గురైంది. తెలుగులో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో పరిచయమైన మంజిమ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. తనకు జరిగిన ప్రమాదంపై మంజిమ సోషల్ మీడియాలో స్పందించింది. కొన్ని వారాల క్రితం తన జీవితంలో ప్రమాదం జరిగిందని చెప్పుకుంది. కాలికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పింది.

తన జీవితంలో ఎదుర్కొన్న కష్టమైన ఘటన ఏదని చాలా మంది అడిగారని, ఇప్పుడు దానికి సమాధానం తన వద్ద ఉందని చెప్పుకొచ్చింది. తనకెంతో ఇష్టమైన నటనకు కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పింది. కారణం లేకుండా ఏదీ జరగదని నమ్ముతున్నానని, తనకు లభించిన ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నానని వ్యాఖ్యానించింది.
Manjima Mohan
Accident
Surgerry
Leg
Social Media

More Telugu News