Suryapet District: హుజూర్ నగర్ లోనే ఉత్తమ్ ఉండొచ్చన్న ఈసీ
- రేపు ఉపఎన్నిక.. స్థానికేతరులు వెళ్లిపోవాలన్న ఈసీ
- ఈసీ ఆదేశాల మేరకు ఉత్తమ్ కు ఫోన్ చేసిన ఎస్పీ
- నల్గొండ ఎంపీని, స్థానికుడినంటూ ఈసీకి లేఖ రాసిన ఉత్తమ్
రేపు హుజూర్ నగర్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానికేతరులంతా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లా ఎస్పీ ఫోన్ చేసి హుజూర్ నగర్ నుంచి వెళ్లాలని చెప్పారు. అయితే, ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఉత్తమ్ లేఖ రాశారు.
తాను నల్గొండ ఎంపీని అని, స్థానికుడిని కనుక హుజూర్ నగర్ లో ఉండేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించారు. హుజూర్ నగర్ లోనే ఉండేందుకు ఉత్తమ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. కాగా, హుజూర్ నగర్ లోని ఉత్తమ్ నివాసం వద్దకు వెళ్లిన పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. ఇక్కడే ఉండేందుకు ఈసీ తనకు అనుమతిచ్చిన విషయం గురించి పోలీసులకు చెప్పడంతో పాటు, సంబంధిత లేఖను కూడా వారికి చూపించారు.