Karthi: 'ఖైదీ' సినిమా కోసం జైలుకెళ్లి ఖైదీలను కలుసుకున్నాను: హీరో కార్తీ
- కార్తీ నుంచి ద్విభాషా చిత్రంగా 'ఖైదీ'
- తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
- అక్టోబర్ 25వ తేదీన విడుదల
ఈ మధ్య కాలంలో కార్తీ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన 'ఖైదీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు మీడియాతో కార్తీ మాట్లాడుతూ .."ఈ సినిమాలో నేను ఖైదీగా కనిపిస్తాను. యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఆ ఖైదీ, తన కూతురును చూడక 10 సంవత్సరాలు అవుతుంది. ఎలాగైనా తన కూతురును చూడాలనే తాపత్రయంతో జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేదే కథ. ఈ కథ అంతా కూడా రాత్రివేళలోనే సాగడం విశేషం. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తాయి. ఈ పాత్ర కోసం నేను జైలుకెళ్ళి నిజం ఖైదీలను కలుసుకుని వాళ్ల మనోభావాలు తెలుసుకున్నాను. అది నాకు బాగా ఉపయోగపడింది" అని చెప్పుకొచ్చాడు.