Andhra Pradesh: ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం... ఏపీలో విస్తారంగా వర్షాలు
- నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
- ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
- ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23న బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడవచ్చని, తద్వారా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తాజా వాతావరణ హెచ్చరికలు చెబుతున్నాయి. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.