Australia: ప్రభుత్వ ఆంక్షలపై ఆస్ట్రేలియా పత్రికల నిరసన గళం
- పాత్రికేయులపై విధించిన ఆంక్షలపై వినూత్న నిరసన
- తొలి పేజీల్లో వార్తలు కొట్టివేస్తూ ప్రచురణ
- సీక్రెట్ అంటే.. ప్రశ్నించాలి అని ఆస్ట్రేలియా మీడియా పిలుపు
పాత్రికేయులపై ఆంక్షలు విధిస్తారా... మా తడాఖా చూపుతామంటూ ఆస్ట్రేలియాలోని వార్తా పత్రికలు ఏకమయ్యాయి. తమ నిరసనను వినూత్నంగా వెల్లడించాయి. పలు పత్రికలు తమ మొదటి పేజీల్లో వార్తలను కొట్టివేస్తూ ప్రచురించాయి. అక్షరాలపై నల్ల సిరా పూసి ఆ పేజీలకు సీక్రెట్ అన్న రెడ్ స్టాంప్ ను వేశాయి. గత జూన్ లో ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ), న్యూస్ కార్ఫ్ ఆస్ట్రేలియా సంస్థలపై పోలీసులు రైడ్ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన మీడియా సంస్థలు పోలీసుల తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒకే తాటిపైకి వచ్చాయి.
మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారంటూ పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తాము చేసే చట్టాల గురించి వివరించాల్సిన అవసరం లేదన్నట్లు, రహస్యమైనవి కూడా ఉంటాయన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పాత్రికేయులు ఆరోపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. ప్రభుత్వం ‘సీక్రెట్’ అన్న ప్రతీసారి ప్రశ్నించాలని ఆ దేశం మీడియా పిలుపు నిచ్చింది.