China: కొత్త తరం వాణిజ్య రాకెట్లను ఆవిష్కరించిన చైనా.. భారత్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం!
- అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో భారత్‌ను వెనక్కి నెట్టే ప్రయత్నం
- ‘స్మార్ట్ డ్రాగన్’, ‘టెంగ్లాంగ్’ పేరుతో రెండు రాకెట్ల ఆవిష్కరణ
- 1.5 టన్నుల పేలోడ్‌ను మోసుకుపోగలిగే సామర్థ్యం
పలు దేశాల ఉపగ్రహాలను అత్యంత చవగ్గా, విజయవంతంగా రోదసీలో ప్రవేశపెడుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. దీంతో భారత మార్కెట్‌ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సిద్ధమైంది. 1.5 టన్నుల పేలోడ్‌ను అవలీలగా రోదసీలోకి మోసుకుపోగలిగే సామర్థ్యం ఉన్న కొత్త తరం వాణిజ్య రాకెట్లు ‘స్మార్ట్ డ్రాగన్’, ‘టెంగ్లాంగ్’లను ఆవిష్కరించింది. ఈ రెండింటిలో ‘స్మార్ట్ డ్రాగన్’ ఘన ఇందనంతో పనిచేయనుండగా, ‘టెంగ్లాంగ్’ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది.
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా జోరు ప్రదర్శిస్తున్నా ప్రపంచ వాణిజ్య మార్కెట్‌ను ఆకర్షించడంలో మాత్రం భారత్ కంటే వెనకబడే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్లో భారత్‌ను వెనక్కి నెట్టేందుకు తాజా రాకెట్లను ఆవిష్కరించినట్టు నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ డ్రాగన్ రాకెట్‌ను వచ్చే ఏడాది ప్రయోగించనుండగా, టెంగ్లాంగ్ రాకెట్‌ను 2021లో ప్రయోగించేందుకు చైనా సిద్ధమవుతోంది.