Vijay Sai Reddy: ఇంకొకరు చెబితే బాగుంటుంది... కానీ, మీకు మీరే ఏంటి చంద్రబాబూ?: విజయసాయి రెడ్డి ఎద్దేవా
- మీడియాతో మాట్లాడుతుంటే, ఈ మూడు మాటలూ మస్ట్
- సమయం, సందర్భం లేకుండా చెప్పుకుంటున్నారు
- ట్విట్టర్ ఖాతాలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఎప్పుడు మీడియా సమావేశాల్లో మాట్లాడినా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్... అన్న పదాలను చంద్రబాబు వాడకుండా ఉండలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మరెవరైనా చెబితే బాగుంటుందిగానీ, సమయం, సందర్భం లేకుండా తానే స్వయంగా చెప్పుకుంటూ పోతే ఎలాగని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం విజయసాయి ట్వీట్లు పెట్టారు.
"మీడియా ముందైనా, సమీక్ష సమావేశాలైనా మూడు విషయాలు తప్పనిసరిగా చెబ్తాడని ముందే తెలిసి పోతుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్. ఇవి లేకుండా మాట్లాడలేడు. ఇంకెవరైనా చెబితే బాగుంటుంది కానీ సమయం సందర్భం లేకుండా మీకు మీరే చెప్పుకుంటే ఎలా చంద్రబాబు గారూ?" అని ప్రశ్నించారు.
అంతకుముందు, "అవునా కాదా తమ్ముళ్లూ? అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నాడు. తను ఎంత ఆవేశపడుతున్నా తమాషా చూస్తున్నట్టు ఏ స్పందన లేకుండా కూర్చున్నారేమిటని కార్యకర్తల వైపు అనుమానంగా చూస్తున్నాడు. పోలవరం, అమరావతి, పిపిఏ ల గురించి అవే పాచి మాటలు. మాటల్లో ఎందుకో వణుకు కనిపిస్తోంది" అని కూడా వ్యాఖ్యానించారు.