ITC: ఈ చాక్లెట్ ఖరీదు అక్షరాలా నాలుగు లక్షలా ముప్పై వేల రూపాయలు మాత్రమే!
- తయారు చేసిన ఐటీసీ
- గిన్నిస్ బుక్ లో స్థానం
- ఫాబెల్లే బ్రాండ్ కింద అందుబాటులోకి
సిగరెట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ విభాగాల నుంచి గృహోపకరణాల వరకూ ఎన్నో బ్రాండ్లను మార్కెటింగ్ చేస్తున్న ఐటీసీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్ ను తయారు చేసింది. దీని ధర కిలోకు రూ. 4.30 లక్షలని సంస్థ తెలిపింది. ఫాబెల్లే బ్రాండ్ కింద 'ట్రినిటీ - ట్రిపుల్ ఎక్స్ ట్రార్డినేట్' పేరిట దీన్ని తయారు చేసింది. ఇంత ఖరీదులో మరో చాక్లెట్ లేదు కాబట్టి, గిన్నిస్ బుక్ లోనూ దీనికి స్థానం లభించిందని ఐటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చాక్లెట్ ఇండియాతో పాటు, ఇంటర్నేషనల్ స్థాయిలోనూ చరిత్ర సృష్టించిందని ఐటీసీ ఫుడ్ డివిజన్ సీఓఓ అనుజ్ రుస్తాగి తెలిపారు.