India: పీవోకేలోని 18 మంది ఉగ్రవాదులను హతమార్చాం: భారత ఆర్మీ ప్రకటన
- ఈ నెల 19, 20 తేదీల్లో దాడులు
- పీఓకేలోని నీలం వ్యాలీ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదుల హతం
- పాక్ సాయంతో పీవోకేలో శిబిరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మరోసారి దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు హతమయినట్లు సైనికాధికారులు తెలిపారు. పీఓకేలోని నీలం వ్యాలీ సహా మరో మూడు ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ దాడులు జరిపినట్లు వివరించారు. పీవోకేలో శిబిరాలు ఏర్పాటు చేసుకున్న జైషే మహ్మద్‌తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ముష్కరులపై శతఘ్నులతో దాడి చేసినట్టు అధికారులు వివరించారు.
బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిన తర్వాత చేసిన దాడులివి. పాక్ సైన్యం సాయంతో పీవోకేలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. దీంతో భారత్ ఈ దాడులు చేసింది.