Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. గాడిలో పడ్డ ఇన్ఫోసిస్
- 95 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 16 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- నిన్నటి భారీ కుదుపు నుంచి రికవర్ అయిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ దెబ్బకు నిన్న కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 39,059కి పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,604కు చేరుకుంది. నిన్న 16.66 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ ఈరోజు 1.14 శాతం పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.72%), మారుతి సుజుకీ (2.29%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.83%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.30%), టీసీఎస్ (1.26%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.59%), వేదాంత లిమిటెడ్ (-2.15%), యస్ బ్యాంక్ (-1.64%), ఓఎన్జీసీ (-1.49%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.44%).