royal vasista: కచ్చులూరు బోటు దుర్ఘటన: ఇంకా గుర్తించాల్సిన మృతదేహాలు రెండు...ఆచూకీ లేనివి నాలుగు!

  • బోటు నుంచి పూర్తిగా ఇసుక, మట్టి తొలగింపు
  • కొన్ని ఎముకలు, సెల్‌ఫోన్‌ లభ్యం
  • ప్రభుత్వ ఆసుపత్రికి అవశేషాల తరలింపు

గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట విషాదంలో ఇంకా నలుగురి ఆచూకీ లభించాల్సి ఉంది. బోటును బయటకు తీసిన అనంతరం నిన్న పారిశుద్ధ్య కార్మికులు బోటులోని ఇసుక, బురదను తొలగించారు. మిగిలిన వారి మృతదేహాలు అందులోనే కూరుకుపోయి ఉంటాయేమోనని ఊహించినా అదేమీ జరగలేదు.

కాకుంటే కొన్ని ఎముకలు, ఓ సెల్‌ఫోన్‌, ఫ్యాంటు, పర్సు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లభించాయి. అలాగే, గ్యాస్‌ సిలెండర్‌, వంట సామగ్రి దొరికాయి. బోటు వెలికితీత సందర్భంగా లభించిన ఎనిమిది మృతదేహాల్లో ఆరింటిని గుర్తించగా, మరో రెండింటిని గుర్తించాల్సి ఉంది. గుర్తు పట్టాల్సిన వాటిలో ఒకటి చిన్నారిది, మరొకటి పురుషునిది. ఇవి గుర్తు పట్టలేని స్థితిలో ఉండడంతో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా కనుక్కుంటామని రాజమండ్రి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News