Pakistan: మా ఆటగాళ్లు టీ10 లీగ్ లో ఆడరు: పీసీబీ

  • గతంలో ఇచ్చిన అనుమతి ఉపసంహరణ  
  • ఆటగాళ్లపై పనిభారం పెరుగుతుందనే... ఈ నిర్ణయం
  • మాజీ ఆటగాళ్లకు మినహాయింపు

పొట్టి ఫార్మాట్ టీ 10 క్రికెట్ లీగ్ లో పాల్గొంటే తమ క్రికెటర్లకు పనిభారం పెరుగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు సాగనున్న టీ 10 క్రికెట్ లీగ్ లో పాక్ ఆటగాళ్లు ఆడరని ప్రకటించింది.

‘ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని వారిపై పనిభారం పెరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ఆటగాళ్లు దేశవాళీ క్వాద్ ఈ అజామ్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది’ అని పీసీబీ తెలిపింది. గతంలో ఈ లీగ్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లను అనుమతించినప్పటికీ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకూడదన్న కారణంగా తాము నిర్ణయం మార్చుకున్నామని పీసీబీ వెల్లడించింది. అయితే మాజీ ఆటగాళ్లపై ఎటువంటి నిబంధనలు లేవని పేర్కొనడంతో షాహిద్ అఫ్రిది ఇతర మాజీలు ఈ లీగ్ లో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News