Telangana: యూనియన్లు లేకుండా ఆర్టీసీ కార్మికులు పని చేస్తే రెండేళ్లలో లక్ష బోనస్ తీసుకుంటారు: సీఎం కేసీఆర్
- ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమం
- ‘ఎస్మా’ ఉండగా సమ్మెకు దిగడం కరెక్టు కాదు
- భూగోళం ఉన్నంత వరకూ ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు
ఆర్టీసీ కార్మికులు యూనియన్లను పక్కనబెట్టి పని చేస్తే కనుక రెండేళ్లలో లక్ష రూపాయల చొప్పున బోనస్ తీసుకునే పరిస్థితి ఉంటుందని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రగతిభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని, ఎస్మా చట్టం అమల్లో ఉండగా సమ్మెకు దిగడం కరెక్టు కాదని అన్నారు. ఆర్టీసీకి పోటీ ఉండాలని ప్రధాని మోదీయే చట్టాన్ని తీసుకొచ్చారని, సెప్టెంబర్ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. భూగోళం ఉన్నంత వరకూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.