Abdul Rahman Geelani: పార్లమెంటుపై దాడి కేసు నుంచి బయటపడిన ప్రొఫెసర్ సయ్యద్ గిలానీ మృతి
- నిన్న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిన గిలానీ
- వర్సిటీలో అరబిక్ బోధన
- దాడికేసులో పడిన ఉరిశిక్షను కొట్టేసిన సుప్రీం
భారత పార్లమెంటుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ గిలానీ గుండెపోటుతో మృతి చెందారు. వర్సిటీలో అరబిక్ బోధించిన గిలానీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న గిలానీని దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కాగా, నిన్న సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.