MS Dhoni: ధోనీకి సాయం చేసిన జీబా... వైరల్ వీడియో!

  • దీపావళి సందర్భంగా వాహనాలు శుభ్రం చేసిన క్రికెటర్
  • చిన్న చిన్న చేతులతో సాయపడిన జీబా
  • గంట వ్యవధిలో 7 లక్షలకు పైగా వ్యూస్
స్టార్ క్రికెటరే అయినా, ఎంతో సింపుల్ గా ఉండే మహేంద్ర సింగ్‌ ధోనికి కార్లన్నా, బైకులన్నా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన, 'నిసాన్‌ జొంగా' జీప్‌ ను కొన్నాడు. తన జీప్ ను ధోనీ కడుగుతుంటే, ఆయన కూతురు జీవా తండ్రికి తనవంతు సాయాన్ని చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

దీపావళి సందర్భంగా వాహనాలను శుభ్రం చేసే పనిని పెట్టుకున్న ధోని, ఓ క్లాత్ తీసుకుని వాహనాన్ని తుడుచుకునే పనిలో పడ్డాడు. తండ్రికి సాయం చేసేందుకు తన బుజ్జి బుజ్జి చేతులతో జీబా కూడా కదిలింది. 'పెద్ద పనికి చిన్న సాయం... ఎప్పటికీ ప్రత్యేకమే' అనే క్యాప్షన్ తో ధోనీ ఈ వీడియోను షేర్ చేయగా, గంట వ్యవధిలో 7 లక్షలకు పైగా వ్యూస్, వేలాది కామెంట్లు వచ్చాయి. మేమూ వచ్చి సాయం చేస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

MS Dhoni
Jeeba
Vehile
Social Media
Viral Videos

More Telugu News